ప్రశాంతంగా హిమాచల్ పోలింగ్..

108
himachal pradesh polling
- Advertisement -

మంచుకొండ హిమాచల్‌ ప్రదేశ్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 7,881 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయగా.. ఇందులో 789 సమస్యాత్మకమైనవిగా, 397 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.

68 అసెంబ్లీ స్థానాల్లో 412 మంది అభ్యర్థులు పోటికి నిలిచారు. 55 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ జరగనుంది.

ఇక ఇక్కడి ఓటర్లు ఒకసారి గెలిచిన సర్కార్‌కు తిరిగి అవకాశం ఇవ్వరు. అదే సంప్రదాయాన్ని ఈ సారి కొనసాగిస్తారా లేదా వేచిచూడాలి. హిమాచల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ నుంచి కేవలం ప్రియాంకా గాంధీ మాత్రమే ఎన్నికల ప్రచార ర్యాలీల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -