క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న సీపీ అంజనీ కుమార్..

45

హైదరాబాద్ అబిడ్స్ ఛాపెల్ రోడ్ లోని మేధాడిస్ట్ చర్చ్‌లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసులకు ది బెస్ట్ పోలీస్ అవార్డుల ప్రదానం చేసింది మెధాడిస్ట్ చర్చ్ కమిటీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. 13 మంది పోలీసులకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మెమొంటో లను అందజేశారు.

అనంతరం పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. నగర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ గొప్ప పండుగ.. ఈ వేడుకలు ప్రజలు అందరినీ మాతాలకు అతీతంగా ఓకే తాటిపై తెస్తాయి. ఇతరులకు మంచి చేయడం, మానవత్వాన్ని చాటడం క్రిస్మస్ యొక్క సందేశం. సంతోషంగా ఆనందంగా మానవత్వాన్ని చాటుతూ పండుగలు జరుపుకోవాలి అన్నారు.

క్రీస్తు సూచించిన విధంగా క్షమించే గుణం ప్రతి ఒక్కరు లో ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించడం, అభిమానించడం వల్ల సమాజం అభ్యున్నతి దిశగా సాగుతోంది. క్రీస్తును పోలి ఉండే జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆశిస్తున్నా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు శ్రయ శక్తుల పోలీసు వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు.