సీఎం జగన్‌పై మాజీ ఎక్సైజ్ మంత్రి ఫైర్‌..

74
- Advertisement -

జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్. జవహర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేఖరులకు విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు. మద్యపాన నిషేదానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. జగన్ మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ మద్యపాన నిషేదాన్ని తుంగలో తొక్కారు. రేట్లు పెంచితే వినియోగం తగ్గుతుందని నాటకమాడారు. రేట్లు అధికంగా పెట్టి మద్యపానాన్ని నిషేదించవచ్చని చెప్పిన జగన్ రెడ్డి దశలవారీ మద్యపాన నిషేదం పేరుతో మరొక అస్త్రాన్ని తీసుకువచ్చారు. ప్రధాన ఆదాయ వనరుగా మద్యాన్ని తీసుకున్నారు. గంటకు పది కోట్లు ఎలా సంపాదించాలి, రోజుకు 245 కోట్లు ఎలా సంపాదించాలి, నెలకు 7,600 కోట్లు ఎలా సంపాదించాలి అనే ఆలోచనలతో మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారు. మద్యపానాన్ని ప్రధాన ఆదాయంగా ఎంచుకొని ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు మండిపడ్డారు.

ప్రస్తుతం 20 శాతం రేట్లు తగ్గిస్తున్నారు, అసలు ఎందుకు పెంచారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న నాణ్యమైన బ్రాండ్‌ను తిరిగి తీసుకొస్తానని చెబుతున్నారు. గత ప్రభుత్వ పాలసీనే బెటర్ అని ఈ సందర్భంగా ఒప్పకుంటున్నారు. మద్యపాన నిషేదం జగన్ వల్ల అయ్యే పని కాదు. మద్యం లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. సంవత్సరానికి 84 వేల కోట్ల రూపాయలకు పైగా సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప మద్యపాన నిషేదాన్ని విధించాలనే ఆలోచన ఏకోశాన జగన్ కు లేదు. పెద్దఎత్తున పేదలను ప్రోత్సహించి తాగించే పరిస్థితిని తెచ్చారు. మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచి ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకుంటూ బొక్కసం నింపుకోవాలని చూస్తున్నారు. కేవలం మద్యపానం ప్రచార ఉత్సవ కమిటీగా ప్రభుత్వం ఉంది. అధికారులు ప్రోత్సహ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవాలని చూస్తోంది. ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటున్నారు. జగన్ మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు సహించరు. మద్యపాన నిషేదానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని ఎవరినడిగినా చెబుతారు. గత ప్రభుత్వంలోని నాణ్యమైన బ్రాండ్‌ని తీసుకొస్తానని జగన్ చెప్పడం.. గత ప్రభుత్వ పాలసీనే బెటర్ అని ఒప్పకోవటంలోనే జగన్ ఆంతర్యం తెలుస్తోంది. దశలవారీ మద్యపాన నిషేదం పేరుతో మరొక అస్త్రాన్ని తీసుకురావటం సిగ్గుచేటు. ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. పెద్దఎత్తున పేదలను ప్రోత్సహించి తాగించే పరిస్థితి తీసుకరావటం దౌర్భాగ్యం. మద్యం లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ఇకనైనా మద్యపాన నిషేదానికి అడుగులు వేయాలని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్ జవహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -