క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల..

36

క్రైస్తవుల పర్వదినం క్రిస్మస్ సందర్భంగా కరీంనగర్‌లో చర్చిలు క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. రాష్ట్ర, కరీంనగర్ జిల్లా ప్రజలకు,క్రైస్తవ సోదరులకు బీసీ సంక్షేమ శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని జ్యోతి నగర్ క్రిస్టియన్ కాలనీ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు ఆయనతోపాటు కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సముచిత గౌరవం కల్పిస్తున్నారని.. అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు.