కరోనా వ్యాక్సిన్ రవాణా ప్రారంభం..

207
Coronavirus vaccine
- Advertisement -

ఈరోజు లేదా రేపు కరోనా వ్యాక్సిన్ రవాణా ప్రారంభం కానుంది. ఈ మేరకు పౌర విమానాలలో వ్యాక్సిన్ల రవాణాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్ సరఫరాలో ప్రధాన కేంద్రంగా పూణే నిలిచింది. దేశవ్యాప్తంగా 41 ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరాకు కేంద్రం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఉత్తర భారత్‌లో వ్యాక్సిన్ మినీ హబ్ లుగా ఢిల్లీ, కర్నాల్ ఖరారు కాగా.. నార్త్-ఈస్ట్ కు నోడల్ గా, తూర్పు భారత్ లో మినీ హబ్ గా కోల్‌కతాను కేటాయించింది.ఇక దక్షిణాదికి హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు అధికారవర్గాల సమాచారం.

- Advertisement -