కరోనాపై పోరు…అప్ డేట్స్

167
corona

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12.71 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 69 వేలు దాటగా ఇప్పటివరకు 2.61 లక్షల మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.36 లక్షలు దాటగా 9,602 మంది మృతిచెందారు.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,289 కి చేరింది. ఇప్పటివరకు దేశంలో 118 మంది మృతి చెందగా, 328 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.మహారాష్ట్రలో 748 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. తమిళనాడులో 571 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఢిల్లీలో 503 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 334కు చేరింది. ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 252కు చేరింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 53 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుగా కాగా ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు.