రాష్ట్రంలో కోవిడ్‌ టెస్ట్‌లు కొన్నసాగుతున్నాయి..

192
corona tests
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిదిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో 50 వేల కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు ఈ నిర్ణయం మేరకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పర్యవేక్షణలో ప్రత్యేక క్యాంప్‌లు నిర్విహించి కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేస్తున్నాయిని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే హైదరాబాద్‌లో కరోనా టెస్టులు తాత్కాలికంగా నిలిపివేశారు అనే వార్తలు రావడంతో దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది.

జూన్ నెల 16వ తేది నుంచి ఇప్పటి వరకు 36వేల శ్యాంపిల్స్‌ని సేకరించగా, అందులో 8,253 శ్యాంపిల్స్‌కు సంబంధించి రిపోర్ట్స్‌ రావాల్సి ఉందన్నారు. శ్యాంపిల్స్ సేకరించిన తర్వాత 48 గంటలలోపు టెస్ట్ చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న శ్యాంపిల్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కొత్త శ్యాంపిల్స్‌ని నిలిపివేస్తున్నట్లు వైద్య ఆరోగ్య స్పష్టం చేసింది. అది కూడా కేవలం క్యాంపుల్లో మాత్రమే శ్యాంపిల్స్‌ సేకరణ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనా టెస్టులకు బ్రేక్ వేయటం లేదు. కరోనా పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ, రేపు(గురు, శుక్రవారం)కరోనా టెస్టులు నిలిపివేస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ స్పందిస్తూ ఓ లేక విడుదల చేసింది.

- Advertisement -