టిక్‌టాక్‌ స్టార్‌ సియా క​క్కర్ ఆత్మహత్య..

203
Siya Kakkar

టిక్‌టాక్‌ సెన్సేషన్‌, డ్యాన్సర్‌ సియా క​క్కర్‌(16) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ప్రీత్‌ విహార్‌లోని ఆమె సొంత నివాసంలో బలవన్మరణానికి పాల్పడినట్లు సియా వ్యక్తిగత మేనేజన్‌ అర్జున్‌ అధికారికంగా ధృవీకరించారు. టిక్‌టాక్‌లో ఈమెకు చాలా ఫాలోయింగ్ ఉంది. దేశవ్యాప్తంగా ఈమెకు మంచి ఇమేజ్ ఉంది. టిక్‌టాక్ అంతా ఈమె జపం చేస్తుంటారు కుర్రాళ్లు. అలాంటిది ఇంత చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వైరల్ భయానీ తన సోషల్ మీడియాలో ఈమె సూసైడ్ గురించి తెలిసింది. సియా కక్కర్ చివరిగా తన మేనేజర్ అర్జున్ సరిన్‌తో మాట్లాడింది.

సియా ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అసలెందుకు ఈమె సూసైడ్ చేసుకుందనేది మిస్టరీగా మారింది. తనతో మాట్లాడిన సమయంలో ఈమె ఎలాంటి బాధలో లేదని.. అలాంటి ఉద్దేశ్యం ఉన్నట్లు కూడా అనిపించలేదని మేనేజర్ తెలిపాడు. ఇక సోషల్‌ మీడియా యూజర్లకు సియా కక్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తారు. సియాకు ఇన్‌స్టాలో 104కే, టిక్‌టాక్‌లో 1.1 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉండట విశేషం.