పిల్లల్లో నాలుగు దశల్లో కరోనా..!

138
third wave
- Advertisement -

కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో …పిల్లల్లో కరోనాపై డీజీహెచ్‌ఎస్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లల్లో నాలుగు దశల్లో వైరస్ ఉంటుందని…ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అవసరం లేదని వెల్లడించింది.

పిల్లలకు వైరస్ సోకితే ఆ తీవ్రతను తెలుసుకునేందుకు ముఖ్యంగా వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలని పేర్కొంది.సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని చెప్పింది.

పిల్లల్లోనూ అసింప్టమాటిక్‌ (లక్షణాలు లేకపోవడం), మైల్డ్‌ (కొద్దిగా), మోడరేట్‌ (మధ్యస్థాయి), సివియర్‌ (తీవ్రం) అనే నాలుగు దశలు ఉంటాయని…సీటీ స్కాన్‌కు బదులుగా చెస్ట్‌ ఎక్స్‌రేతో పరిస్థితిని తెలుసుకోవచ్చని పేర్కొంది.

ఐదు సంవత్సరాల నుంచి పన్నెండేళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే మాస్కు ధరించాలని….పన్నెండేళ్లు పైబడిన వారంతా పెద్దలతో సమానంగా మాస్కులు ధరించాలని పేర్కొంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేతులు తరచు శుభ్రం చేసుకోవాలని… కరోనా వైరస్‌ వ్యాప్తి అందరిలో ఒకే రకంగా ఉన్నప్పటికీ ప్రభావం చూపడంలో తేడాలుంటున్నాయని వెల్లడించింది.

మైల్డ్ స్టేజ్‌లో ఉంటే యాంటీబయోటిక్స్‌ వద్దని అదేవిధంగా లక్షణాలను బట్టి చికిత్స అవసరం అని తెలిపింది. సివియర్‌గా ఉంటే ఆస్పత్రిలో చేర్చాల్సిందేనని తెలిపింది.

- Advertisement -