కాంగ్రెస్‌కు శస్త్ర చికిత్స అవసరం:వీరప్ప మొయిలీ

33
verappa

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్ధితిపై ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద పార్టీని వీడి బీజేపీలో చేరడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత చరిత్రపై ఆధారపడకుండా పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని వెల్లడించారు. బాధ్యతలను అప్పగించేటప్పుడు విశ్వాసమున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

జితిన్ వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉండేదన్నారు…. ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక స్థానమైనా లభించలేదని తెలిపారు మొయిలీ. ఆయన అసమర్థుడని…పార్టీ కన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు.