దేశంలో 24 గంటల్లో 91,702 కరోనా కేసులు..

22
coronavirus

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 91,702 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3,403 మంది ప్రాణాలు కొల్పోయారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,92,74,823కు చేరగా 2,77,90,073 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 3,63,079 మంది మృతి చెందగా ప్రస్తుతం దేశంలో 11,21,671 యాక్టివ్‌ కేసులున్నాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 24,60,85,649 డోసులు వేయగా పాజిటివిటీ రేటు 4.48శాతంగా ఉంది.