షర్మిల సభకు కరోనా ఎఫెక్ట్..!

129
sharmila
- Advertisement -

ఏప్రిల్ 9న ఖమ్మంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల భారీ బహిరంగసభ,అదే రోజు పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా కరోనా రూపంలో బ్రేక్ పడింది. భారీ జనసమీకరణ చేసి అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకోవాలని భావించిన షర్మిలకు తిప్పలు తప్పలేదు.

సభను జరుపుకునేందుకు అనుమతిని ఇచ్చిన పోలీసులు కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరు వేల మందికి మించి జనం ఈ సభకు రాకూడదు. సాయత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు మాత్రమే సభను నిర్వహించుకోవాలని సూచించారు.

గడువు ముగిసేలోపే సభను ముగించేయాలి. సభలో అందరూ మాస్కులు విధిగా ధరించాలి. సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు ఉండాలని షర్మిల పార్టీ ఖమ్మం ఇంఛార్జ్ లక్కినేని సుధీర్‌కు సూచించారు. దీంతో నిబంధనల ప్రకారం సభ నిర్వహిస్తామని షర్మిల టీమ్‌ పోలీసులకు వెల్లడించారు.

- Advertisement -