కరోనా వైరస్‌ వ్యాక్సిన్ రెడీ!

520
corona
- Advertisement -

కరోనా వైరస్‌..ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు చైనాకే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఇరాన్ దేశాల్లో విజృంభిస్తోంది. శనివారం ఒక్క రోజే ఇరాన్‌లో 205 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,119 మంది చనిపోగా 90 వేలకు పైగా ఈ మహమ్మారి భారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ వైరస్‌కు విరుగుడు కోసం అంతా ఎదురుచూస్తుండగా శుభవార్తను అందించింది అమెరికా. కరోనా తొలి వ్యాక్సిన్‌ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌‌ను మనుషులపై ప్రయోగాలకు సిద్ధం చేశామని తెలిపింది .ఈ ట్రయల్స్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

తొలి దశ ప్రయోగం విజయవంతమైతే.. అది అందుబాటులోకి రావడానికి ఏడాది సమయం పడుతుంది. 2002లో సార్స్ విజృంభించినప్పుడు దాని వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యే సరికి 20 నెలలు పట్టగా తాజాగా కరోనా వైరస్‌ జన్యు సమాచారం తెలుసుకున్న ఆరు వారాల్లోనే వ్యాక్సిన్‌ను రూపొందించి, మనషులపై ప్రయోగాలకు రెడీ చేయడం విశేషం.

- Advertisement -