తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

285
etela

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33 కు చేరినట్లు వెల్లడించారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజెందర్. మరో 97మంది అనుమానితులు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని కోఠి కమాండ్ సెంటర్ లో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో ఈటల రాజేందర్ ఇవాళ సమావేశం నిర్వహించారు.

క్వారంటైన్ లో ఉన్నవాళ్లను 14రోజుల తర్వాత పరీక్షలు చేసి ఇంటికి పంపిస్తామని చెప్పారు. హోం క్యారంటైన్ లో ఉన్న వాళ్లు మాత్రం బయట తిరిగితే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉపేక్షించబోమని చెప్పారు. గాంధీ, కింగ్ కోఠీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కరోనా చికిత్సకు తమ వంతు సయం చేయనున్నాయన్నారు.