రేవంత్ రెడ్డికి బిగ్‌షాక్….!

169
- Advertisement -

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై మళ్లీ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పీసీసీ కుర్చీ మాకంటే మాకు అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటుండడంతో సాగర్ ఉప ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్ష నియామకం సంగతి తేలుస్తామని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మే 2 న సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు తేలిన వెంటనే తెలంగాణ పీసీసీ చీఫ్ వ్యవహారం తేలనుంది. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై కన్నేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మొండి చేయి చూపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో కేసీఆర్ సర్కార్‌ను ఎదుర్కోగలిగిన దమ్ము ఒక్క రేవంత్‌కే ఉందని కాంగ్రెస్‌ హైకమాండ్ కూడా భావిస్తుంది.

అయితే రేవంత్‌ కోసం దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న సీనియర్ నేతలను వదులుకోవడానికి సోనియమ్మ ఇష్టపడడం లేదంట..మరో పక్క పీసీసీ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లంతా ఎవరికి వారు రాయబారం చేసుకుంటున్న వేళ రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు చెప్పాపెట్టకుండా పాదయాత్ర చేయడమే కాకుండా పాదయాత్ర ముగింపు సభలో కొండా సురేఖ వంటి నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలపై విమర్శలు చేయించడం, సోషల్ మీడియాలో రేవంత్ అనుచరులు సీనియర్లను కించపరుస్తూ పోస్టులు పెట్టడం కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేసింది. రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారంట..రేవంత్‌కు పీసీసీ ఇస్తే ఇఛ్చుకోండి..కాని మేం మాత్రం మాదారి మేం చూసుకుంటామని..అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చారంట.

పైగా కూన శ్రీశైలం గౌడ్, ఇందిరాశోభన్, ఏపూరి సోమన్న వంటి తన మద్దతుదారులను బీజేపీలోకి వెళ్లకుండా ఆపలేకపోయాడు..పాలమూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని చిన్నారెడ్డికి మెజారిటీ తీసుకురాలేకపోయాడు ఇదీ రేవంత్ సత్తా అని కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి చెప్పారంట..దీంతో సోనియమ్మ రేవంత్‌కు పీసీసీ పదవి ఇచ్చే విషయంలో సోనియమ్మ పునరాలోచనలో పడినట్లు సమాచారం. సాగర్ ఉప ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ వ్యవహారాన్ని తేల్చే పనిలో పడిందంట..అయితే తాజా సమాచారం మేరకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకత్వ పగ్గాలు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డిని నమ్ముకుంటే అసలు పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని అధిష్టానం భావిస్తుందంట.

అందుకే రేవంత్‌కు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించి వచ్చేసారి కేంద్రంలో అధికారంలో వస్తే కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తుందంట..ఇదే విషయాన్ని రేవంత్‌కు చెప్పి నచ్చచెప్పి, పీసీసీ పదవిని జానారెడ్డి లేదా జీవన్ రెడ్డిలలో ఎవరికో ఒకరికి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తుందంట..సాగర్‌లో జానారెడ్డి గెలిస్తే ఆయన్ని పీసీసీ చీఫ్‌గా చేయడం ఖాయమని సమాచారం. జానా సారథ్యంలో 2023 ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందంట..ఒక వేళ జానారెడ్డి ఓడిపోతే మాత్రం ప్రత్యామ్నాయంగా జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పెద్దలు సమాలోచన చేస్తున్నారంట. మొత్తంగా పీసీసీ చీఫ్ పదవిపై రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లనున్నట్లు తెలుస్తోంది. మరి రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ పోస్టు రాకపోయినా సర్దుకునిపోతాడో..లేదా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కొత్త పార్టీ పెడతాడో చూడాలి..!

- Advertisement -