గుండెపోటుతో కమెడియన్ కన్నుమూత..

156
Comedian Vadivel Balaji

కోలీవుడ్‌కు చెందిన కమెడియన్ వడివేల్ బాలాజీ(42) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు గుండెపోటు రావడంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆతర్వాత ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ రోజు మరోసారి ఆయన కు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.

విజయ్ టీవీలో ప్రసారమయ్యే ఓ కామెడీ షోతో బాలాజీ బాగా పాప్యులర్ అయ్యాడు. పలు తమిళ చిత్రాల్లో నటించాడు. ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలును ఆయన అనుకరించేవాడు… దీంతో, ఆయనకు వడివేలు బాలాజీ అనే పేరు స్థిరపడిపోయింది. పలువురు సినీనటీనటులు, టీవీ ఆర్టిస్టులు సోషల్ మీడియా వేదికగా వడివేల్ బాలాజీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.