హౌస్‌లో అందరికీ చుక్కలు చూపించిన దివి..

562
Divya vadthya

బిగ్ బాస్ హౌస్‌లో 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది నటి దివి .. ఈ అమ్మడు ఎంట్రీ సాంగ్‌తోనే అదరగొట్టింది. తన నాజూకు అందాలతో కుర్రకారుకి మంచి కిక్ ఇచ్చింది. అయితే గత నాలుగు రోజులు బిగ్ బాస్ హౌస్‌లో మౌన ప్రదర్శన చేస్తుందో ఏమో తెలియదు కాని.. పొరపాటున కూడా ఈ అమ్మడు ఒక్క మాట మాట్లాడినట్టు కనిపించలేదు. ఇప్పటి వరకూ దివి మాట్లాడినట్టు కాని.. ఇతరులతో చర్చించినట్టు కాని కనిపించలేదు. అయితే గురువారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కి తన మాటలతో చుక్కలు చూపిస్తోంది. తాజాగా గురువారం నాటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో దివి మాట్లాడితే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించింది.

మోనాల్‌.. ఊరికే ఏడుస్తుంద‌ని, లాస్య సెన్సిటివ్ అని చెప్పింది. సూర్య‌.. నా మాటే విను అన‌డం త‌గ్గించుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికింది. ఇక ఈ ప్రోమోతో దివి మౌనం వెన‌క ప‌ర‌మార్థాల‌ను వెలికి తీస్తున్నారు నెటిజ‌న్లు. ఆమె ఇన్ని రోజులు మౌనం వహించ‌డం.. త‌న స్ట్రాట‌జీలో భాగ‌మ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మిగ‌తా కంటెస్టెంట్ల‌ను నిశ్శ‌బ్ధంగా గ‌మ‌నించి ఆ త‌ర్వాత త‌న అస‌లు సిసలైన‌ ఆట మొద‌లుపెట్టే స‌మ‌యం కోసం వేచి చూస్తోంద‌ని అంటున్నారు. అయితే దివి త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌డం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగమేన‌ని తెలుస్తోంది. మరి అసలు విషయం తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

From #Divi point of view...Correct ye antara?? #BiggBossTelugu4 Today at 9:30 PM on #StarMaa