బీజేపీ ఎంపీలు అసమర్ధులు: నామా

137
mp nama

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంటులో మేము జరిపే పోరాటానికి ఇక్కడి కాంగ్రెస్ ,బీజేపీ ఎంపీలు కలిసి వస్తారో,రారో తేల్చుకోవాలి అన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. ప్రగతిభవన్‌లో పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ జరిపిన సమావేశం ముగిసింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నామా మీడియా ద్వారా మాట్లాడుతూ… కాంగ్రెస్ ,బీజేపీ ఎంపీలు తెలంగాణలో కాదు వారు ఢిల్లీలో మాట్లాడాలి. సీఎం కెసిఆర్ ఏడేళ్లుగా సమస్యలపై కేంద్రానికి ఉత్తరాలు రాసి అలసిపోయారు. ఇక కేంద్రాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు అన్నారు.

విద్యుత్ చట్టంతో రైతుల వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు పెట్టాలని చూస్తూన్నారు. ఈ విధానాన్ని బీజేపీ ఎంపీలు ఎలా సమర్దిస్తారు? కనీసం నవోదయ స్కూళ్ళు సాధించని అసమర్ధులు బీజేపీ ఎంపీలు అని నామా విమర్శించారు. జీఎస్టీ చట్టంతో తెలంగాణ వేల కోట్లు నష్టపోయింది. కరోనా పేరుతో కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని చూస్తోంది. ఇక జాతీయ రహదారుల విషయంలో కనీసం గుంత పూడ్చడం లేదు. పార్లమెంట్ లో ప్రశ్నోత్తారాలు తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. పార్లమెంటు లోపల ,బయట కలిసి వచ్చే పార్టీ లతో కలిసి ధర్నా చేస్తామని నామా పేర్కొన్నారు.