చైనాతో జరిగిన సైనిక ఘర్షణలో తెలంగాణ వాసి కర్నల్ సంతోష్ బాబు ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వీర జవాన్‌ను కేంద్రం మహావీర్ చక్ర పురస్కారంతో సత్కరించింది. మంగళవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ సతీమణి, తల్లి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అదేవిధంగా గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన జవాన్లు హవిల్దార్ కె పలానీ, సిపాయ్ గుర్‌తేజ్ సింగ్, నాయక్ దీప్ సింగ్, నాయిబ్ సుబేదార్ నుదురామ్ సోరెన్‌కు వీర్ చక్ర పురస్కారాలను అందించింది కేంద్రం.
నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు. గల్వాన్ లోయ వద్ద భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోగా 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.