ట్రెండింగ్‌లో బంగార్రాజు…టీజర్ రిలీజ్

99
chaitu
- Advertisement -

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ‘బంగార్రాజు’ చిత్రంతో ఈ ఇద్దరూ మరో సారి మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు.

నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా టీజర్‌ని రిలీజ్ చేశారు. ఇక చైతూ బర్త్ డేకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చేతిలో కర్ర పట్టుకుని నాగ చైతన్య కనిపించడం, ఆ గెటప్, చేతికి బ్రాస్ లెట్ ఇలా అన్ని చూస్తుంటే పాత్ర మీద అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది.రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

- Advertisement -