సీఎం కేసీఆర్….రంజాన్ తోఫా

528
cm kcr ramzan
- Advertisement -

మరికొద్దిరోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లిం సోదరులకు శుభవార్తనందించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతిఏటా రంజాన్‌ను అధికారికంగా నిర్వహిస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది కూడా అధికారికంగా నిర్వహించడంతో పాటు ఇఫ్తార్‌ విందును ఇవ్వనుంది. సచివాలయంలో మైనార్టీ సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ రంజాన్‌ పండుగ ఏర్పాట్లపై చర్చించారు.

రంజాన్‌ పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇక ఇఫ్తార్‌ విందు కోసం ప్రతి మసీదుకి రూ.లక్ష మంజూరు చేయనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మసీదు ప్రాంతాల్లో శానిటేషన్, రోడ్లకు మరమ్మతులు, లైటింగ్‌ తదితర ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. మసీదుల దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని మసీదుల దగ్గర తాగునీటి వసతికి మెట్రో వాటర్‌ బోర్డు సహకారం తీసుకోవాలన్నారు. వేసవిని నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్‌ క్యాంపులను ఏర్పాటుచేసి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. మే 5 నుండి రంజాన్ మాసం ప్రారంభం కానుండగా ఎలాంటి అవాంతరాలు కలగకుండా రంజాన్ మాసం జరుపుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -