తలసానితో ఎగ్గే మల్లేశం భేటీ..

325
mallesham

కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేషం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లేషం ను మంత్రి సన్మానించి అభినందనలు తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో కురుమ సంఘం ఉపాధ్యక్షులు కొండల్ రాజ్, చీర శ్రీకాంత్, జెనరల్ సెక్రెటరీ బండారు నారాయణ, కార్యదర్శులు నరసింహ, ఎక్కాల కన్నా, కట్ట మల్లేషం, దేవర రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.