వార‌ణాసిలో ఇస్మార్ శంక‌ర్

456
ismart shankar
- Advertisement -

ఎన‌ర్జిటిక్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. డ‌బుల్ దిమాక్ హైద‌రాబాది` ట్యాగ్ లైన్‌.

ఈ సినిమా భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ రేప‌టి నుండి వారణాసిలో చిత్రీక‌రించ‌నున్నారు. సినిమా కీల‌క ఘ‌ట్టంలో ఈ యాక్ష‌న్ పార్ట్ ఉంటుంది. కాబ‌ట్టి డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ భారీ రేంజ్‌లో ఈ సీక్వెన్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు. హైద‌రాబాద్ నుండి సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వార‌ణాసి వెళుతున్నారు. పూరి స్ట‌యిల్లో రియ‌ల్ స‌తీష్ ఈ యాక్ష‌న్ పార్ట్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు.లీడ్ పెయిర్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌తో ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీప‌క్ శెట్టి, తుల‌సి త‌దిత‌రులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

న‌టీన‌టులు: రామ్,నిధి అగ‌ర్వాల్‌,న‌భా న‌టేష్‌,పునీత్ ఇస్సార్‌,స‌త్య‌దేవ్‌,ఆశిష్ విద్యార్థి,గెట‌ప్ శ్రీను,సుధాంశు పాండే త‌దిత‌రులు,సాంకేతిక వ‌ర్గం:ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌,ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ,ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌,మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌,నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌,ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

- Advertisement -