యాదాద్రికి సీఎం కేసీఆర్…

165
yadadri
- Advertisement -

సీఎం కేసీఆర్‌ ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి పంచనారసింహ క్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం ప్రగతిభవన్‌ నుంచి బయల్దేరి రోడ్డుమార్గంలో 11 గంటలకు యాదాద్రికి చేరుకుంటారు. బాలాలయంలో స్వామిని దర్శించుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలిస్తారు.

సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్‌శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు గట్టి నిఘా ఉంచారు. పెద్దగుట్టపైన టెంపుల్‌ సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద కూడా తగు భద్రతా చర్యలు చేపట్టారు. దేశానికే తలమానికంగా చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -