గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం..

637
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్‌ ఈ రోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ యాక్ట్‌, ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారని సమాచారం. రాష్ట్ర ప్రజలకు సత్వరమే సేవలు అందించేలా పటిష్ఠమైన రెవెన్యూచట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్న విషయం తెలిసిందే.

కొత్తగా రానున్న రెవెన్యూచట్టంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులతో విస్తృతంగా చర్చించారు.భూ క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా అమ్మినవారి ఖాతానుంచి డిలీట్ అయి కొనుగోలుచేసిన రైతు ఖాతాలో జమకావాలని, ఇవన్నీ పట్టాదార్ పాస్‌పుస్తకంలో నమోదు కావాలి.

ఇక ముందు తనకు సమస్య ఉన్నదని, తన భూమిని రికార్డుల్లోకి ఎక్కించాలని, పహాణీలు కావాలని కార్యాలయాల చుట్టూ రైతు తిరిగే దుస్థితి పోవాలని.. ఈ కొత్త రెవెన్యూ చట్టంతో భూ వివాదాలకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.

Chief Minister K Chandrasekhar Rao will be meeting governor Tamilisai Sounderarajan today at Raj Bhavan. He will be holding talks on the ongoing..

- Advertisement -