సీఎం కేసీఆర్ నా ప్రాణాలు కాపాడారు:అల్లరి సుభాషిణి

453
cm kcr allari subashini
- Advertisement -

సీఎం కేసీఆర్ తన ప్రాణాలు కాపాడిన దేవుడని సినీనటి అల్లరి సుభాషిణి తెలిపారు. ఓ షోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన సుభాషిణి సినిమా అవకాశాలు లేక, ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టి డబ్బులు అన్ని పొగొట్టుకున్నానని తెలిపారు. ఈ క్రమంలో తనకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిందని తనకు సినిమా అవకాశాలు లేవు,చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపారు.

ఓ హాస్పిటల్‌కి వెళ్తె సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారన్నారు. తాను సీఎం కేసీఆర్‌ని కలిసేందుకు ప్రగతిభవన్‌కు వెళ్లానని ఆయనే ఎదురొచ్చి తనకు స్వాగతం పలికారని చెప్పారు. తన సమస్య విని వెంటనే ఆపరేషన్‌కు అవసరమైన డబ్బును సాంక్షన్‌ చేయించారని..వెంటనే ఆపరేషన్‌ జరగడంతో క్యాన్సర్‌ని జయించానని వెల్లడించారు.

తన క్యాన్సర్‌ వచ్చినప్పుడు ఇండస్ట్రీలోని చాలామంది ముందుకొచ్చిసాయం చేశారని తెలిపారు. మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఇప్పటికి తనకు సాయం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో చలపతిరావు తనకు అత్యంత సన్నిహితుడని తెలిపారు.

- Advertisement -