మాజీ డీజీపీ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం…

37
kcr cm

ఉమ్మడి రాష్ట్రంలో డిజిపి గా పనిచేసిన డా. బి ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తీవ్రమైన చాతి నొప్పి రావడంతో వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అమెరికాలో తుదిశ్వాస విడిచారు. బి.ప్రసాదరావు 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. అవినీతి నిరోధక శాఖ డీజీపీగా, హైదరాబాద్‌ సీపీ, విశాఖ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 1997లో ఇండియన్ పోలీస్ మెడల్, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు.