కరోనాతో జర్నలిస్ట్ టీఎన్‌ఆర్‌ మృతి…

56
tnr

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పాపుల‌ర్ యూ ట్యూబ్ హోస్ట్‌, న‌టుడు టీఎన్ ఆర్ క‌రోనాతో క‌న్నుమూశారు. కొద్ది రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్యం ఈ రోజు విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు.

టీఎన్ఆర్ పూర్తి పేరు తుమ్మ‌ల న‌ర్సింహారెడ్డి. టీఎన్ఆర్‌గా యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ ఎంతో మందిని ఇంట‌ర్వ్యూ చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధించారు. పలు సినిమాల్లో నటించి మెప్పించారు.