నోముల భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి..

40
cm kcr

టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య భౌతికకాయానికి నివాళి అర్పించారు సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో జరిగిన నోముల అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్…నోముల భౌతిక‌కాయం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళుల‌ర్పించారు. నోముల కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు.

సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళుల‌ర్పించారు.