గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి…

49
gic

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శాంసన్ అడిషనల్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషన్ అమరేందర్ రెడ్డి.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గారు కృషి అభినందనీయం . ఆయన స్ఫూర్తి యువతరానికి ఆదర్శం . భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం చేపట్టారు . దీనికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రజల్లో మొక్కల పెంపకం పైన మంచి అవగాహనా కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు . ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని మరో ముగ్గురికి మద్దుల లక్ష్మి చైర్ పర్సన్, మల్లికార్జున్ వార్డ్ కౌన్సిలర్ , వెంకటేష్ యూత్ లీడర్ గుండ్లపోచంపల్లి గార్లకి ఛాలెంజ్ చేశారు.