కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష: కేటీఆర్

90
ktr

కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే తెలంగాణ‌కు శ్రీరామ‌ర‌క్ష అని భావించి.. ఇత‌ర పార్టీల నేత‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్ నగర్‌ కార్పొరేషన్‌లోని నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు,ఘట్‌కేసర్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. కృష్ణ జలాలతో పాటు ఇతర సమస్యలపై రాజీ లేని పోరాటం చేసింది టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. అత్యంత ఎక్కువ స‌మ‌స్య‌లు ఉన్న ప్రాంతం జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్. ఈ కార్పొరేష‌న్ అభివృద్ధికి త‌ప్ప‌కుండా నిధులు మంజూరు చేస్తామ‌న్నారు. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్ర‌జ‌ల‌కు దుర్గంధం లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. జీవో నం. 58, 59 ప్ర‌కారం ఇండ్ల ప‌ట్టాలు ఇచ్చిన‌ట్లే.. ఇవ్వాల‌ని జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్ర‌జ‌లు కోరారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో ఉంది కాబ‌ట్టి ఆ ప్ర‌కారం ఇండ్ల ప‌ట్టాలు ఇవ్వ‌లేక‌పోయాం.

ఈ స‌మ‌స్య‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారిస్తామ‌ని చెప్పారు. ప్ర‌తి పేద వ్య‌క్తికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రెన్ని కుప్పిగంతులు వేసినా.. కొన్ని ప‌ద‌వులు రాగానే కోతికి కొబ్బ‌రిచిప్ప దొరికిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అలాంటి వారిని మ‌నం ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదన్నారు.