రాములోరి పెళ్లి.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం..

50
cm kcr

భద్రాచలం దేవస్థానం పూజారులు ముఖ్య మంత్రి కేసీఆర్‌ను కలిసి రాములోరి కళ్యాణానికి రావాలని ఆహ్వానించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 21న జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరిగింది. ఈ మేరకు గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ ఈవో బి.శివాజీ, వేదపండితులు కలిసి ఆహ్వాన పత్రిక, జ్ఞాపిక, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, మాలోత్‌ కవిత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడా ఆహ్వాన పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు స్థలశాయి, ఏఈవో శ్రవణ్‌కుమార్, సీసీ అనిల్, అర్చకులు పాల్గొన్నారు.