దేశంలో రికార్డు స్థాయిలో కరోనా‌ కేసులు..

60
corona

దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,31,968 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 780 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో మొత్తం నమోదైన తాజాగా కేసులతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,30,60,542కు చేరింది. 61,899 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,19,13,292 మంది కోలుకున్నారు. అలాగే తాజాగా నమోదైన మరణాలతో మృతుల సంఖ్య 1,67,642కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9,79,608 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

మరో వైపు దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,43,34,262 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 13,64,205 కరోనా శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 25.40 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.