మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఆరంభం..

56
ipl 2021

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2021 సీజన్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభంకాబోతోంది. ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెపాక్‌లో ఢీకొట్టబోతున్నాయి. రోహిత్‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలనే ఉత్సాహంలో ఉండగా.. విరాట్‌ కెప్టెన్సీలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కనీసం ఓ సారైనా విజేతగా నిలవాలని తపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం ప్రారంభ మ్యాచ్‌ జరుగనుంది.

ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్‌లు ఉంటాయి.. ఇందులో 10 డబుల్ హెడర్స్ జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం మ్యాచ్ 3.30.. రాత్రి మ్యాచ్‌లకి 7.30 గంటలకి జరుగుతాయి. ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటికీ ఆరు సిటీలు ఆతిథ్యం వహిస్తున్నాయి.