తగ్గిన పేదరికం.. దటీజ్ కే‌సి‌ఆర్!

57
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కే‌సి‌ఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది. గత తొమ్మిదేళ్ళ కాలంలో ఇతర ఏ రాష్ట్రాలకు సాధ్యం కానీ విధంగా తెలంగాణ పురోగతి సాధించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్దిలోనూ సమపాళ్ళలో కే‌సి‌ఆర్ పాలన సాగుతుండడంతో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, రాష్ట్రంలో వనరులను సమకూర్చడంలోనూ, నిరుద్యోగాన్ని రూపు మాపడంలోనూ, పేదరికాన్ని దూరం చేయడంలోనూ.. ఇలా ప్రతిదాంట్లో కే‌సి‌ఆర్ తన పాలన దక్షతతో చూపిస్తున్న వైవిద్యం.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

ఇదిలా ఉంచితే తెలంగాణలో పేదరికం తగ్గినట్లు నీతి అయోగ్ విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ 2023 రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఈ నివేధిక ప్రకారం 2015-16 నాటికి రాష్ట్రంలో 13.18 గా వున్న పేదరికం 2019-21 నాటికి 5.88 శాతం తగ్గిందని ఆ నివేదిక తెలిపింది. దీంతో కే‌సి‌ఆర్ పాలనపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ కంటే మెరుగైన వరరులు కలిగిన ఆయా రాష్ట్రాలు పేదరికాన్ని రూపుమాపడంలో విఫలం అవుతూనే ఉన్నాయి. కానీ ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే కే‌సి‌ఆర్ తన సుపరిపాలనతో రాష్ట్రంలో పేదరికాన్ని ఘననీయంగా తగ్గించడం నిజంగా హర్షించాల్సిన విషయం. తెలంగాణలో పెదేరికం తగ్గడంపై తాజాగా ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ” కే‌సి‌ఆర్ నాయకత్వం నిబద్దత కలిగిన పాలన కారణంగానే ఇది సాధ్యమైందని, నిజంగా తెల్లంగన గర్వ పడాల్సిన విషయం అంటూ కే‌టి‌ఆర్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇంకా పలువురు ప్రముఖులు కూడా తెలంగాణలో పేదరికం తగ్గడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:సమ్మె వీడి విధుల్లో చేరండి:హరీశ్ పిలుపు

- Advertisement -