ఈ నెల 12న సీఎం కేసీఆర్ మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన కలెక్టరేట్, జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ) భవనాలను ప్రారంభించనున్నారు. ఇక అలాగే 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న సీఎం…అక్కడ సమీకృత భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు.
వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రాలకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్లలో తగిన ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రజలు అటూ, ఇటూ వెళ్లనవసరం పనిలేకుండా అన్ని పనులను ఒకేచోట పూర్తిచేసుకునేందుకు వీలవుతుంది.
ఇక ఇప్పటికే సిద్దిపేట, కామారెడ్డి, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాల్లో కలెక్టరేట్లను ప్రారంభించారు. నిర్మల్, గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కరీంనగర్ తదితర జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం తుదిదశకు చేరాయి. ములుగు, నారాయణపేట జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం ఇటీవలే ప్రారంభం కాగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణం టెండర్ల దశలో ఉంది. వరంగల్‌లో ఇంకా స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..