ఏపీ బీఆర్ఎస్‌..దూకుడు పెంచిన కేసీఆర్

81
- Advertisement -

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు కార్యాచరణను వేగవంతం చేశారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా తొలుత ఏపీ, కర్ణాటకలపై దృష్టి సారించారు. ఇక ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించగా తాజాగా ముందుచూపుతో పావులు కదుపుతున్నారు బీఆర్ఎస్ చీఫ్.

ఓ కాపు నేత అధ్యక్షుడిగా ప్రకటించడం వెనుక బిగ్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడంతో పాటు రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ లో సుమారు 20 అసెంబ్లీ స్థానాలు, మూడు లేదా నాలుగు స్ధానాలలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల ఏపీలో బీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించిందట.. ఆ సర్వే రిపోర్ట్ లో అధికార వైసీపీకి పూర్తి వ్యతిరేకత వచ్చిందని, అందుకే కేసీఆర్ తమ అభ్యర్థులను నిలబెట్టాలని అనుకుంటున్నట్లు టాక్. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు జిల్లాలైన గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, కర్నూలు, కృష్ణాజిల్లాలో అభ్యర్థులను బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు గుంటూరు రెండు నుంచి లోకసభకు,మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి నిలబెట్టనున్నట్లు టాక్‌. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. మొత్తంగా బీఆర్ఎస్ విస్తరణ ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -