బ్లూ టూత్‌తో ఫోన్ హ్యాక్‌..తస్మాత్ జాగ్రత్త!

42
- Advertisement -

సైబర్ నేరగాళ్లకు ఇంటర్నెట్ హాట్ స్పాట్‌గా మారింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిదీ డిజిటల్ కావడంతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకు అకౌంట్లను టార్గెట్ చేస్తూ ఇప్పటివరకు ఓటీటీలతో డబ్బులు దోచుకున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఇలాంటి సైబర్ కేసులు గణనీయంగా పెరిగాయి. అయితే ఓటీపీలపై ప్రజల్లో కాసింత అవగాహన రావడంతో నేరగాళ్లు కొత్తబాట పట్టారు.

బ్లూ టూత్ ద్వారా ఫోన్ హ్యాక్ చేసి అకౌంట్లో డబ్బుని ఓటీటీ లేకుండానే దోచేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇటువంటి కేసులు భారీగా పెరిగాయి. దీనినే బ్లూ టాత్ స్కామ్ అని కూడా పేరు పెట్టారు. మన ఫోన్‌లో బ్లూ టూత్ అన్‌లో ఉండి గుర్తు తెలియని వ్యక్తుల బ్లూ టూత్‌ని ఒకే చేసామో ఇక అంతే సంగతులు. క్షణాల్లో మీ ఫోన్‌ని హ్యాక్ చేసి అకౌంట్‌ని గుండుసున్నా చేస్తారు. దీనికి ఓటీపీ కూడా అవసరం లేదు.

ఇలా తెలియకుండానే ఇతరుల బ్లూ టూత్‌ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి నష్టపోయిన బాధితులు చాలామందే ఉన్నారు. అలాగే ఏ విధంగా పరిచయం లేని వ్యక్తుల నుండి వచ్చే మెయిల్స్ ,మెస్సేజీలలో ఉండే లింక్లను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -