హరికృష్ణ మృతిపట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి ..

172
CM KCR

బుధవారం తెల్లవారు జామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని అన్నెపర్తి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఈ ఘటన జరిగింది.

CM KCR

హరికృష్ణ మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సినీ రాజకీయ రంగాల్లో హరికృష్ణ సేవలను సీఎం స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎంతోపాటు సినిమాటోగ్రాఫ‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హ‌రికృష్ణ మృతికి సంతాపం ప్ర‌క‌టించారు.

మోహ‌న్ బాబు, మంచు లక్ష్మీ, మ‌నోజ్, కోన వెంక‌ట్‌, అల్లు శిరీష్‌, త‌మ్మారెడ్డి, దేవి శ్రీ ప్రసాద్‌, సాయిధ‌ర‌మ్ తేజ్, హ‌రీష్ శంక‌ర్ త‌దిత‌రులు హ‌రికృష్ణ మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. కొద్దిసేప‌టి క్రితం హ‌రికృష్ణ కుమారులు ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ నార్కెట్ ప‌ల్లిలోని కామినేని ఆసుప‌త్రికి చేరుకున్నారు. తండ్రిని చూసి బోరున విల‌పించారు.