దర్శకనిర్మాత ఇగో…హీరోకి నష్టం

15
- Advertisement -

ఒక క్రియేటివ్ వ్యక్తికి ఎప్పుడూ ఇగో ఉంటుందనేది నిజం. అభిషేక్‌ నామా దాన్ని తప్పు పట్టలేం అంటూనే నవీన్ మేడారం విషయంలో తప్పు పట్టాడు. ఫలితంగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా వచ్చిన “డెవిల్” నష్టాలను మిగిల్చింది. ఇగో అనేది క్రియేటివ్ ప్రాసెస్ లో భాగంగా సినిమాకు ఉపయోగపడేలా ఉండాలి, కానీ నిర్మాత ఇగో సినిమాపై నెగటివ్ ప్రభావం చూపకూడదు. సినిమా బాగు కోసం ఒక్కోసారి తమ ఇగోలను నిర్మాతలు పక్కనపెట్టాలి కూడా. ప్రస్తుతం దర్శకుల యుగం నడుస్తోంది కదా.

ఇంతకీ, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. “డెవిల్” కోసం నందమూరి కళ్యాణ్ రామ్ పెట్టిన ఎఫెక్ట్స్ వృధా అయిపోయాయే అని బాధతో చెబుతున్నాం. వాస్తవానికి ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా ప్రామిసింగ్ గానే వచ్చాయి. ఇక వీకెండ్ రెండు రోజుల్లో కలెక్షన్స్ కూడా స్టడీ గానే ఉన్నాయి. కానీ చివరకు డెవిల్ బ్రేక్ ఈవెన్ కాలేదు. అసలు ఈ సినిమా ఇంకా బెటర్ టాక్ తెచుకోగల సినిమానే. కానీ ఒక స్థాయి వరకూ వచ్చి ఆగిపోవడానికి ప్రధాన కారణం నిర్మాత అభిషేక్‌ నామా ఇగో.

డెవిల్ రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలకు పైమాటే. ఈరోజుల్లో ఈ రన్ టైమ్ తో సినిమా రిలీజ్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి. ఇక్కడే దర్శకుడు అడ్డం పడ్డాడు. నా నిర్ణయానికే అడ్డు చెబుతావా ? ఇది అభిషేక్‌ నామా మాట. ఎక్కువ నిడివున్న చిత్రాలు కూడా హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. కానీ దానికి ఒక లెక్క ఉంటుంది. డెవిల్ విషయంలో మీ లెక్క తప్పుతుంది అని అభిషేక్‌ నామాకి దర్శకుడు నవీన్ మేడారం ఎంత చెప్పినావు వినలేదు.

ఫలితంగా సినిమాకి నష్టాలూ వచ్చాయి. ఇక్కడ అభిషేక్‌ నామాది మాత్రమే తప్పు అని చెప్పలేం, దర్శకుడు నవీన్ మేడారం తప్పు నూటికి నూరు పాళ్ళు ఉంది. స్క్రిప్ట్ పై అవగాహన లేకుండా డెవిల్ సినిమాని స్టార్ట్ చేశాడు. మొత్తానికి ఇద్దరి ఇగోలు కారణంగా కళ్యాణ్ రామ్ కి నష్టం జరిగింది.

Also Read:టీడీపీకి ఎన్టీఆర్ ఎఫెక్ట్ తప్పదా?

- Advertisement -