వైకుంఠధామాల నిర్మాణం వేగవంతం చేయండి: సీఎం

43
KCR

రాష్ట్రంలో నూటికి నూరుశాతం వైకుంఠధామాలను వచ్చే నెల రోజుల లోపు నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు సిఎం కెసిఆర్. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంత్రివర్గ సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతి పై క్యాబినెట్ కు పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు నివేదికలు సమర్పించాయి. ఈ నేపథ్యంలో మాట్లాడిన సీఎం…ఇకపై అన్ని గ్రామాల్లో, వీధి దీపాల కొరకు మూడో వైర్ ను తప్పకుండా ఏర్పాటు చేయాలని సూచించారు.

నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ రూ.1200 కోట్లు మంజూరు చేశారు. నీటి ఎద్దడి నివారణకై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.