సీఎం కేసీఆర్‌ని కలిసిన టీఎన్జీవో నేతలు..

35
kcr

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని రూపొందించడతో పాటు, రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు , అందుకు అనుగుణంగా వెంటనే 50 వేల నూతన ఉద్యోగాల భర్తీ చేపట్టడం పట్ల., ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మంగళవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు టీఎన్జీవో నేతలు. సీఎంను కలిసిన వారిలో టీఎన్జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్., టీజీవో అధ్యక్షురాలు మమత.,ప్రధానకార్యదర్శి సత్యనారాయణ. ఫోటోలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు.