రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ

140
rahul

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్….కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. ఇప్పటికే పలుమార్లు శరద్ పవార్‌ని కలిసిన కిశోర్ తాజాగా రాహుల్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నట్టుగా సమాచారం. ఢిల్లీలోని రాహుల్‌ గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోగా ఈ సమావేశంలో ఏం చర్చించారనేది వేచిచూడాల్సిందే.

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ తిరిగి అధికారంలోకి రాగా.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్‌ని అధికారంలోకి తీసుకురావడంలో తనవంతు పాత్రను పోషించారు ప్రశాంత్ కిశోర్. అయితే తర్వాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన ప్రశాంత్..తర్వాత శరద్‌ పవార్‌ లాంటి సీనియర్ రాజకీయ నేతను కలవడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.