మొక్కలు నాటిన చొప్పదండి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు..

54
Green India Challenge

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చొప్పదండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొల్లూరి జితేందర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొల్లూరి జితేందర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరిత హరం కార్యక్రమంలో పల్లెలు పట్టణాల్లో సీఎం కేసీఆర్ చెట్లు నాటిస్తున్నారు. అలాగే జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేప్పటి అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నటినందుకు సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కతజ్ఞతలు తెలియజేస్తున్నాము.