కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన దేవేగౌడ!

41
devegowda

కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు మాజీ ప్రధాని,జేడీఎస్ అధినేత దేవేగౌడ. జేడీఎస్‌ను కూల్చలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు మాజీ సీఎం సిద్ధరామయ్య నాయకత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

తాను ఉన్నంత కాలమే కాదు, తర్వాత కూడా జేడీఎస్‌ సుస్థిరంగా ఉంటుందన్నారు. ఉత్సాహం, విశ్వాసం ఉన్న కార్యకర్తలు తమకు అండగా ఉన్నారని పార్టీని మళ్లీ బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీని ఎవరూ నాశనం చేయలేరని వెల్లడించారు.

2023లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.బీజేపీలో జేడీఎస్‌ విలీనమవుతుందనే వదంతులను కొందరు తమ సరదాకోసం సృష్టించినవేనని చెప్పారు. ఎప్పటికీ అలాంటి ప్రతిపాదన ఉండబోదని చెప్పారు.