సంచార కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే చిరుమర్తి

407
chirumarthi lingaiah
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడొద్దు అన్న ముఖ్యమంత్రి కెసీఆర్ పిలుపుమేరకు ఓ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ నల్లగొండ జిల్లాలోని నాలుగు సంచార కుటుంబాలకు బాసటగా నిల్చి, వారికి ఆర్దిక సాయం, నిత్యవసర వస్తువులను అందించి మరో సారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.

నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఏ.పీ లింగోటం గ్రామ శివార్లలో సంచార జాతులకు చెందిన నాలుగు కుటుంబాల వారు గుడెసెలు వేసుకోని జీవనం సాగిస్తున్నారు.. ఓ పత్రికలో వీరికి తినడానికి తిండి కరువైందని వార్తను ప్రచురించింది..దీంతో వెంటనే వార్తను చూసి చలించి పోయిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు స్దానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యకు ఫోన్ చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు.

ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వయంగా వారి వద్దకు వెళ్ళి ఆ నాలుగు కుటుంబాలకు కూరగాయలు,నిత్యవసర వస్తువులు, బియ్యం ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్దిక సాయాన్ని అందించారు…మనస్సున ముఖ్యమంత్రి కెసీఆర్ గారి పిలుపుమేరకు ఇప్పటికే నియోజిక వర్గంలో ఉన్న పేదలకు అందిరికి బియ్యం, నిత్యవసర వస్తువుల్ని అందించామని, ఇంకా ఎవరైనా ఉంటె వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే వారిని ఆదుకుంటామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు చెప్పిన వెంటనే ఈ నాలుగు కుటుంబాలను ఆదుకున్నామని, ,భౌష్యత్తులో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటామని తెల్పారు….పొట్ట చేత బట్టుకోని బ్రతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.

- Advertisement -