సనత్‌నగర్‌లో తలసాని ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

250
talasani
- Advertisement -

కరోనా వైరస్ సోకకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. సనత్ నగర్ నీలిమ ఆసుపత్రి లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన బ్లడ్ డొనేషన్ కాంప్ ని ప్రారంభించారు ఈటల .

ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల..తలసేమియా పేషెంట్స్ కి రక్తం కొరత ఏర్పడిందని…వైద్యఆరోగ్య శాఖ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశాం అన్నారు. దీంతో ఇవాళ తలసాని ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు…వారి ఆధ్వర్యంలో 250 యూనిట్ల బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. పెద్ద ఎత్తున్న ప్రజలు రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుతున్నాం అన్నారు.

సనత్ నగర్ నియోజక వర్గ ప్రజలు పెద్ద ఎత్తున్న వచ్చి బ్లడ్ ఇవ్వాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. రక్తహీనత తో బాధపడే రోగులకు బ్లడ్ చాలా అవసరం…ప్రభుత్వం కరోనను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుందన్నారు.

- Advertisement -