కేటీఆర్ ఆదేశాలతో మాలిపురంకు అధికారులు..

192
minister ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగారు చేనేత జౌళి శాఖ అధికారులు. తిరుమలగిరి మున్సిపాలిటి పరిధిలోని మాలిపురంలో పర్యటించారు చేనేత జౌళి శాఖ ఏడీ మహ్మద్ జహీరుద్దీన్. చేనేత కార్మికుల స్ధితి గతులపై క్షేత్రస్ధాయి విచారణ చేపట్టారు.

వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్కీములు అన్ని వారికి అందేవిధంగా చూస్తామని…పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు జహీరుద్దీన్. కేటీఆర్‌ మంచి మనసుతో స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు గ్రామస్తులు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్.ఈ సందర్భంగా జిల్లాకు చెందిన దివ్యాంగురాలు విజయమ్మ మంత్రి కేటీఆర్ ను కలిసింది. తన అల్లుడి పరిస్ధితితో పాటు చేనేత కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -