- Advertisement -
అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు, బోర్డు చైర్మన్లతో కేంద్రం అత్యన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రమేష్ పొక్రియాల్, స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకే కేంద్రం మొగ్గు చూపింది.
జేఈఈ, నీట్ పరీక్షలు జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జులైలో ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. జూన్ 1న విధివిధానాలు, పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కేంద్ర విద్య శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన అప్షన్లపై వారం రోజుల్లో రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పాలన్న సూచించింది కేంద్రం.
- Advertisement -