సీబీఎస్ఈ ఫలితాలు విడుదల

51
- Advertisement -

సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఫలితాలు ప్రకటించనున్నారు. ఈమేరకు వెబ్‌సైట్‌లు కూడా తెలిపారు. అయితే గతంలో వచ్చిన నకిలీ వార్తలు సీబీఎస్ఈ ఖండించింది. కాగా నేడు ఉదయం 11గంటల ప్రాంతంలో వెలువడే అవకాశం ఉందని తెలిపింది. సీబీఎస్ఈ ఫలితాలు 2023 ప్రకటించబడిన తర్వాత విద్యార్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. 16,60,511మంది విద్యార్థులకు గాను 14,50,174మంది విద్యార్థులు పాస్ అయినట్టు ప్రకటించింది. మొత్తంలో 87.33శాతంగా నమోదైనట్టు తెలిపారు. గతేడాది రిజల్ట్ 92.71గా నమోదైనట్టు దృవీకరించారు. కాగా ఈ సారి పాస్ పర్సెంటేజ్ తగ్గింది.

Also Read: మే 12..అంతర్జాతీయ నర్సింగ్ డే

cbse.gov.in, results.cbse.nic.in, cbse.nic.in, digilocker.gov.inలో కూడా ఫలితాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. కాగా సీబీఎస్ఈ 10వ తరగతికి పరీక్షలకు 22లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇవి ఫిబ్రవరి 15,2023 నుంచి మార్చి 21, 2023వరకు జరిగాయి. 12వ తరగతికి సుమారు 16లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీటిని ఫిబ్రవరి 15, 2023 నుంచి ఏప్రిల్‌ 5, 2023వరకు జరిగాయి.

Also Read: లేడీ విత్‌ ది లాంప్…ఫ్లోరెన్స్‌ నైటింగేల్

- Advertisement -